Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ4లో రూ.1,682 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: ఇండిగో పేరుతో విమానయాన సేవలు అందిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు అధిక ఇంధన ధరల దెబ్బ భారీ నష్టాలను మూటగట్టుకునేలా చేశాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.1,682 కోట్ల నష్టాలు చవి చూసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,147 కోట్ల నష్టాలు నమోదు చేసింది. అధిక ఇంధన ధరలు క్రితం త్రైమాసికంలో భారీ నష్టాలకు కారణమయ్యాయని ఆ వర్గాలు తెలిపాయి. 2021-22లో ఏవియేషన్ టర్వైన్ ప్యూయల్ (ఎటిఎఫ్) ధరలు ఏకంగా 61 శాతం ఎగిశాయి. విమానయాన కంపెనీల నిర్వహణలో ఇంధనం వాటా వ్యయం సగానికి ఉంటుంది. గడిచిన క్యూ4లో ట్రావెల్ డిమాండ్ పెరగడం ద్వారా రెవెన్యూ 29 శాతం వృద్థితో రూ.8,021 కోట్లుగా నమోదయ్యింది. ఇది కొంత ఉపశమనం కల్పించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.6,233 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. బుధవారం బీఎస్‌ఈలో ఆ కంపెనీ సూచీ 2 శాతం తగ్గి రూ.1,648 వద్ద ముగిసింది.