Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిగతా 29.5 శాతం వాటా విక్రయం
- ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం
న్యూఢిల్లీ : హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌ను పూర్తిగా ప్రయివేటుపరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సంస్థలో వేదాంత గ్రూపునకు 64.92 శాతం, కేంద్రానికి 29.5 శాతం చొప్పున వాటాలున్నాయి. ప్రభుత్వానికి ఉన్న మిగితా వాటాను కూడా విక్రయించడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. డిజిన్వెస్ట్‌మెంట్, ప్రయివేటీకరణ ప్రక్రియ వేగవంతంలో భాగంగా దీన్ని చేపట్టింది. ప్రస్తుత షేర్ మార్కెట్ ధరలతో పోల్చితే 29.5 శాతం వాటా విలువ రూ.38,560 కోట్లుగా ఉంటుంది. ఈ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయించనున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) అధికారి ఒక్కరు వెల్లడించారు.వాజ్‌పేరు ప్రభుత్వం 2002లో తొలిసారి వేదాంత జింక్‌లోని 26 శాతం వాటాను వేదాంత స్టెరిలైట్ ఇండిస్టీస్‌కు విక్రయించగా.. ఆ తర్వాత క్రమంగా ప్రభుత్వం వాటాలను అమ్ముతూ రాగా.. అగర్వాల్ తన వాటాను పెంచుకుంటూ వచ్చారు. అలా.. హిందుస్థాన్ జింక్‌లో ప్రస్తుతం వేదాంతకు 64.9 శాతం వాటా ఉంది. మరో 5 శాతం వాటా కొనుగోలుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఇటీవలే వేదాంత గ్రూపు చైర్మెన్ అనీల్ అగర్వాల్ పేర్కొన్నారు. హెచ్‌జడ్‌ఎల్‌లో వాటాల విక్రయం ప్రకటనతో బుధవారం ఎన్‌ఎస్‌ఈలో ఆ కంపెనీ షేర్ 4.10 శాతం పెరిగి రూ.307.50 వద్ద ముగిసింది. మోడీ సర్కార్ ఇటీవలే ఎల్‌ఐసీలో రూ.20వేల కోట్ల పైగా విలువ చేసే 3.5 శాతం వాటాను మార్కెట్ శక్తులకు కట్టబెట్టింది. వేల కోట్ల విలువ చేసే హాన్స్ ఇండియాను కేవలం రూ.211 కోట్లకు అమ్మేసింది. డజన్ పైగా పిఎస్‌యులను ప్రయివేటీకరించాలని లేదా వాటిల్లో వాటాలు విక్రయించాలని బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.