Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తీవ్రవాదులకు, తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్‌ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. మాలిక్‌కు మరణశిక్ష విధించడమే సరైందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తొలుత కోర్టుకు విన్నవించింది. కానీ కోర్టు మాత్రం యావజ్జీవం విధిస్తూ తీర్పు ఇచ్చింది. కాశ్మీరీల వలసలకు మాలిక్ బాధ్యుడని ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్‌కు ఎన్‌ఐఎ తెలియచేసింది. కాగా, క్షమాభిక్ష ప్రసాదించాలని తాను కోర్టును వేడుకోబోనని, కోర్టు తన ఇష్టం వచ్చిన రీతిలో నిర్ణయం తీసుకుంటుందని అంతకుముందు మాలిక్ చెప్పాడు. కాగా మాలిక్‌కు సాయంగా కోర్టు నియమించిన అమికస్ క్యూరీ మాట్లాడుతూ, కనీస శిక్షను విధించాల్సిందిగా కోరారు. తాను ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రుజువైతే రాజకీయాల నుండే తాను వైదొలగుతానని మాలిక్ చెప్పాడు. అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ఇప్పటికే దోషిగా తేలినందున ఇక ఈ కేసులో వాస్తవాలపై వాదించడంలో అర్థం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
టీవీ నటి అమ్రీన్‌ను అతి దారుణంగా...
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. తాజాగా బూద్గామ్ జిల్లాలో టీవీ నటి అమ్రీన్ భట్ (35)ను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు గాయపడ్డాడు. ''బుధవారం రాత్రి 7.55 గంటల సమయంలో ఇంట్లో ఉన్న అమ్రీన్ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె పరిస్థితి విషమించడంతో మతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు'' అని కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. అమ్రీన్ భట్ టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యారు.ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్ జుబీర్‌కు కూడా బుల్లెట్ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇది నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల పనేనని పోలీసులు తెలిపారు.