Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుదుచ్చేరి విద్యుత్‌శాఖ కార్మికుల నిరసన
- బీజేపీ సర్కారు ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపు
న్యూఢిల్లీ : అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీని ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీలో నష్టమే ఇందుకు కారణమని మోడీ సర్కార్ చెబుతున్నది. కాగా, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పుదుచ్చేరిలోని విద్యుత్ శాఖ కార్మికులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖలోని అన్ని కార్మిక సంఘాలు సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) నేతృత్వంలో నిరసనలు ముమ్మరం చేశారు. ఇటీవల ఒక రోజు సమ్మెకు దిగారు. యూటీలోని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కమ్)ను ప్రయివేటీక రించే ప్రయత్నాలను మోడీ సర్కార్ వెంటనే విరమిం చుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయా న్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు, నిరవధిక సమ్మెలకు దిగుతామనీ, న్యాయపోరాటం చేస్తామని జేఏసీ నేతలు తెలిపారు. బీజేపీ సర్కారు ప్రయివేటీకరణ యత్నాలను తిప్పికొట్టా లని పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ తీవ్ర నష్టాల్లో నడుస్తున్నదన్న వాదనను జేఏసీ తీవ్రంగా వ్యతిరేకించింది. 'ప్రయివేటీకరణకు నష్టాలను కారణంగా చెబుతున్నారు. వారి వాదన తప్పు. కొన్ని ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగాకాకుండా.. పుదుచ్చేరి విద్యుత్ బోర్డు లాభాల్లో నడుస్తున్నది. కాబట్టి విద్యుత్‌ను ప్రయివేటీకరించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వరంగ సంస్థలనన్నింటినీ అమ్మేసి.. కార్పొరేట్లకు కట్టబెట్టాలని కుట్ర ఇందులో దాగుంది. వెంటనే కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం' అని డిపార్ట్‌మెంట్‌లోని సీఐటీయూ కార్యదర్శి రామస్వామి అన్నారు.