Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పునర్వ్యవస్థీకరణ రుణాలపై అప్రమత్తం
- బ్యాంక్‌లకు ఆర్బీఐ సూచన
న్యూఢిల్లీ : కరోనా కాలంలో పునర్ వ్యవస్థీకరిం చిన రుణాలపై బ్యాంక్‌లు అప్రమత్తంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచించింది. వీటిల్లో ఎక్కువగా మొండి బాకీలుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కరోనా సంక్షోభం నుంచి బ్యాంకింగ్ రంగం ఆర్థిక సూచీలు మెరుగుపడుతు న్నాయని ఆర్బీఐ తన 2021-22 రిపోర్ట్‌లో పేర్కొంది. కొన్ని పునర్వ్యవస్థీకరణ రుణ ఖాతాలు ఆందోళన కలిగిస్తోన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే త్రైమాసికంలో ఈ ప్రభావాలు తప్పకుండా కనబడనున్నాయని తెలిపింది. భవిష్యత్తు ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకునే దానిపై దృష్టి పెట్టాలని ఆర్బీఐ సూచించింది.
ఒత్తిడిలో ఎన్బీఎఫ్సీలు..!
బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్బీఎఫ్సీ)లతోనూ బ్యాంక్‌లు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ హెచ్చరించింది. వాటి ఆస్తుల నాణ్యత బలహీనపడుతోందని.. దీంతో బ్యాంక్‌ల బ్యాలెన్స్ షీట్లపై నీలినీడలు కమ్ముకునే అవకాశం ఉందని విశ్లేషించింది. అదే విధంగా ఆర్థిక స్థిరత్వానికి ఎన్బీఎఫ్సీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఆర్బీఐ అప్రమత్తం చేసింది. 2021-22లో (డిసెంబర్ ముగింపు నాటికి) ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్ షీట్లు బలహీనంగా చోటు చేసుకున్నట్లు ఆర్బీఐ తన రిపోర్టులో పేర్కొంది. ఈ రంగంలోని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ 2018లో నగదు లభ్యత సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఆ తర్వాత ఎన్‌బీఎఫ్‌సీల కోసం ఆర్బిఐ కొన్ని ప్రత్యేక విధివిధానాలు రూపొందించింది. అయినప్పటికీ డిహెచ్ఎఫ్ఎల్, శ్రేయి గ్రూపు, రిలయన్స్ కాపిటల్ లాంటి పెద్ద ఎన్బీఎఫ్సీలు కూడా వ్యాపారాల్లో విఫలమై దివాలా తీశాయి.
పెద్ద నోట్ల పంపిణీ నిలిపివేత
కొన్నేళ్లుగా రూ.2000 విలువ గల నోట్ల ముద్రణ, పంపిణీ నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది. 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రూ.2000 నోట్ల సరఫరా 1.6 శాతం తగ్గిపోయింది. 2020-21లో రెండు శాతం పంపిణీ పడిపోయింది. స్థూలంగా గతేడాదితో పోలిస్తే 17.3 శాతం నుంచి 13.8 శాతానికి చెలామణి పడిపోయిందని వెల్లడించింది. 2022 మార్చి ముగింపు నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో రూ.500, రూ.2000 నోట్ల విలువ 87.1 శాతం ఉంది.