Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్ ఇండియా ఇంధన దిగుమతి
- ఏడేండ్ల తర్వాత తొలిసారి
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ అయిన కోల్ ఇండియా యుటిలిటీల కోసం ఇంధనాన్ని దిగుమతి చేసుకోనున్నది. ఈ మేరకు విద్యుత్ మంత్రిత్వ శాఖ లేఖను రాయిటర్స్ ఉటంకించింది. ఈ విధంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం ఏడేండ్ల తర్వాత ఇది తొలిసారి కావటం గమనార్హం. విద్యుత్ అంతరాయాల ఆందోళన నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తున్నది. 2015 తర్వాత కోల్ ఇండియా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. ''కోల్ ఇండియా గవర్నమెంట్-టు-గవర్నమెంట్ (జీ2జీ) ఆధారంగా బొగ్గును దిగుమతి చేసుకుంటుంది. స్టేట్ జనరేటర్స్, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుల (ఐపీపీఎస్) థర్మల్ పవర్ ప్లాంట్లకు సరఫరా చేస్తుంది'' అని ఫెడరల్ పవర్ మినిస్ట్రీ ఈనెల 28 నాటి లేఖలో పేర్కొన్నది. 2022 మూడో త్రైమాసికంలో భారత్.. అధిక విద్యుత్ డిమాండ్ అంచనాల కారణంగా విస్తృతంగా బొగ్గు కొరతను ఎదుర్కొంటుందని నిపుణులు భావిస్తున్నారు. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు ఏప్రిల్ నుంచి 13 శాతం క్షీణించటం గమనార్హం.