Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ : పొగాకు నియంత్రణకు చేసిన కృషికి గాను జార్ఖండ్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) అవార్డు లభించింది. వరల్డ్ నో టుబాకో డే (డబ్ల్యూఎన్టిడి) అవార్డ్-2022కు జార్ఖండ్‌ను డబ్ల్యూహెచ్ఒ ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధికారులు ఆదివారం ప్రకటించారు. వరల్డ్ నో టుబాకో డే సందర్భంగా ఈ నెల 31న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును రాష్ట్ర వైద్య శాఖలోని టుబాకో నియంత్రణ విభాగం అధికారులు అందుకుంటారు.