Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర కామెంట్ల ఫలితం
న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముంబయిలోని పైధోని పోలీసు స్టేషన్లో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భారత సున్నీ ముస్లింల సన్నీ బరెల్వీ సంస్థ రజా అకాడమీ చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక న్యూస్ చర్చ కార్యక్రమంలో భాగంగా నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలపై కేసు నమోదైందని పోలీసు అధికారులు తెలిపారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఆందోళన వ్యక్తం చేసింది.