Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనేక భాషలు
- ఇది మన గొప్ప సంపద
- మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశంలో భిన్నమైన దుస్తులు, ఆహారం, సంస్కృతే మన గుర్తింపు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశంలో అనేక భాషలు, లిపులు, మాండలికాల గొప్ప సంపద ఉందని అన్నారు. ఆదివారం ''మన్ కీ బాత్''లో ఆయన మాట్లాడారు.
''దేశంలో అనేక భాషలు, లిపులు, మాండలికాల గొప్ప సంపద ఉంది. వివిధ ప్రాంతాలలో భిన్నమైన దుస్తులు, ఆహారం, సంస్కృతి మన గుర్తింపు. ఈ వైవిధ్యం ఒక దేశంగా మనల్ని శక్తివంతం చేస్తుంది. మనల్ని ఐక్యంగా ఉంచుతుంది'' అని అన్నారు. ''ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన రాంభూ పాల్రెడ్డి గురించి నాకు తెలిసింది. రాంభూపాల్ రెడ్డి ఉద్యోగ విరమణ తరువాత తన సంపాదనంతా ఆడపిల్లల చదువుల కోసం విరాళంగా ఇచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 'సుకన్య సమృద్ధి యోజన' కింద దాదాపు 100 మంది ఆడపిల్లల కోసం ఖాతాలు తెరిచి అందులో 25 లక్షల రూపాయలకు పైగా డబ్బును డిపాజిట్ చేశారు'' అని తెలిపారు.''జూన్ 21న ఎనిమిదో 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' జరుపుకోబోతున్నాం. ఈసారి యోగా దినోత్సవ అంశం మానవత్వం కోసం యోగా. 'యోగా డే'ని ఉత్సాహంగా జరుపుకోండి. అలాగే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు యావత్ ప్రపంచంలో మునుపటి కంటే మెరుగైన పరిస్థితి ఉంది. ఎక్కువ టీకా కవరేజ్ కారణంగా ఇప్పుడు ప్రజలు గతంలో కంటే ఎక్కువగా బయటకు వెళ్తున్నారు. మన జీవితంలో ఆరోగ్యానికి ఉండే ప్రాధాన్యతను కరోనా తెలియజేసింది. ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాధాన్యత చాలా ఉంది'' అని మోడీ పేర్కొన్నారు.