Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాన్యువల్ స్కావెంజింగ్‌పై నాలుగో వారానికి చేరుకున్న ఆందోళన
- నిరసనకారుల ప్లకార్డుల ప్రదర్శన
న్యూఢిల్లీ : మ్యాన్యువల్ స్కావెంజింగ్తో మరణాలను నివారించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి చేపట్టిన 'యాక్షన్2022' ప్రచారం నాలుగో వారంలోకి ప్రవేశించింది. దీని కింద దేశవ్యాప్తంగా ప్రపంచ నగరాల్లో 'స్టాప్ కిల్లింగ్ అజ్' ప్లకార్డులతో నిరసనకారులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల నుంచి చేతితో మానవ మలాన్ని తొలగించే పద్ధతిని నిర్మూలించడానికి సఫాయి కరంచారి ఆందోళన్ (ఎస్కేఏ) ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. 75 రోజుల సుదీర్ఘ కార్యక్రమం ఈనెల ప్రారంభంలో ఢిల్లీలో తన మొదటి ఆందోళన ప్రదర్శనను నిర్వహించింది. భారత్ స్వాతంత్య్రం పొంది ఈ ఏడాదిలో 75 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఈ అవగాహనా డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. అనేక ఏండ్లుగా ఈ అమానవీయ పద్ధతి ఉండటంపై అనేక మంది సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పునరావాసం చట్టం, 2013 ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ చట్టబద్ధంగా ''అన్ని రూపాల్లో'' నిషేధించబడింది. ఈ చట్టం మాన్యువల్‌గా ఏ వ్యక్తినైనా ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. 2013 చట్టాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయడం లేదని, దీంతో పారిశుద్ధ్య కార్మికులపై దోపిడీ కొనసాగుతుందని సామాజిక కార్యకర్తలు వాదిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం.. 1993 నుంచి దేశవ్యాప్తంగా 2021 మంది మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులలో పడి మరణించారు. గతేడాది, ఎస్కేఏ జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్.. మాన్యువల్ స్కావెంజింగ్ కారణంగా దేశంలో 2016 నుంచి 2020 వరకు 472 మంది మరణించారని పేర్కొన్నారు. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లలో మరణాలు నేటికీ కొనసాగుతున్నాయని ఇటీవల 'మమ్మల్ని చంపడం ఆపండి(స్టాప్ కిల్లింగ్ అజ్)' ప్రచారానికి సంబంధించి ఆయన చెప్పారు. ప్రస్తుతం మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులలో పని చేస్తున్న వ్యక్తులకు ప్రభుత్వం గౌరవప్రదమైన వృత్తులను అందిం చాలని 'స్టాప్ కిల్లింగ్ అజ్' ప్రచారం డిమాండ్ చేస్తున్న దని విల్సన్ అన్నారు. ఢిల్లీలో ప్రారంభమైన ప్రచారం రాజస్థాన్, ఉత్తరాఖండ్లను కవర్ చేసి హర్యానాకు చేరుకుందని మానవ హక్కుల కార్యకర్త చెప్పారు.