Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పీఎం కేర్స్ ఫర్ చిల్ట్రన్' పథక ప్రయోజనాలను విడుదల చేసిన ప్రధాని
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వల్ల అమ్మానాన్నలను కోల్పోయిన పిల్లలకు.. ఆప్యాయత, తల్లీతండ్రిలేని లోటు పూడ్చలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భరత మాత మీ వెంట ఉందంటూ పిల్లలకు భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారితో అనాథలైన పిల్లలకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 'పీఎం కేర్స్ ఫర్ చిల్ట్రన్' పథకం ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం విడుదల చేశారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఉపకార వేతనాలతో పాటు పీఎం కేర్స్ పాస్ బుక్, ఆయుష్మాన్ భారత్, జన్ ఆరోగ్య యోజన హెల్త్ కార్డులను పంపిణీ చేస్తారు. లబ్దిదారులకు ఐదు లక్షల వరకు అవసరమయ్యే వైద్య ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. కరోనాతో చనిపోయిన వాళ్ల బిడ్డలకు తోడ్పాటుగా, వాళ్ల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకే పీఎం కేర్స్ ఫండ్ ఇప్పుడు ఉపయోగపడుతోందని ప్రధాని మోడీ అన్నారు.
''మీ తల్లిదండ్రుల ప్రేమను ఏ ప్రయత్నం భర్తీ చేయకపోవచ్చు. అండగా భరతమాత మీ వెంటే ఉంటుంది. పిఎం కేర్స్ ద్వారా ఈ దేశం మీ ప్రయోజనాలను నెరవేరుస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తో, సంస్థో లేదంటే ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నం మాత్రమే కాదు. పీఎం కేర్స్‌లో కోట్ల మంది ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చారు'' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.