Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులు-2023 కోసం ఆన్లైన్ నామినేషన్లు, సిఫార్సులకు దాఖలు చేసేందుకు గడువు 2022 సెప్టెంబర్ 15తో పూర్తవుతుందని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సుల స్వీకరణ 2022 మే 1 నుంచి ప్రారంభమైంది. ఇవి కేవలం ఆన్లైన్లో స్వీకరిస్తుంది. అవార్డ్స్.జిఓవి.ఇన్ జాతీయ అవార్డుల పోర్టల్ లో స్వీకరిస్తారు.దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి పద్మా అవార్డులు ఇస్తారు. 1954 నుంచి ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళ, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సోషల్ వర్క్, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్, సేవ, వాణిజ్యం, పరిశ్రమ వంటి అన్ని రంగాలు, విభాగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు, సేవలకు అందిస్తారు. జాతి, వృత్తి, స్థానం, లింగ భేదం లేని వ్యక్తులందరూ ఈ అవార్డులకు అర్హులు. వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు.