Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్రానికి ఆదేశం
షిల్లాంగ్ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మేఘాలయలో అక్రమ ర్యాట్‌హౌల్ మైనింగ్ జరగటంపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి సంజిబ్ బెనర్జీ, న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ఎస్ థంగ్ఖ్యీవ్, జస్టిస్ డబ్ల్యూ. డీంగ్డోV్‌ా లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఇందుకు న్యాయస్థానం నాలుగు వారాల గడువును విధించింది. ఇందుకు సంబంధిత అధికారులందరూ తమ చర్యలను క్రమబద్దీకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. అక్రమ ర్యాట్‌హౌల్ మైనింగ్ విషయంలో ఎన్జీటీ 2014-19 మధ్య బ్యాన్ విధించింది. సుప్రీంకోర్టు రూ. 100 కోట్ల పెనాల్టీని విధించింది. అయినప్పటికీ.. వెస్ట్ జైన్షియా హిల్స్, ఈస్ట్ జైన్షియా హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్ లలో ర్యాట్ హౌల్ మైనింగ్ కొనసాగటం గమనార్హం.