Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదిలో దేశ వ్యాప్తంగా ఇండ్ల ధరలు 7.5 శాతం పెరుగొచ్చని రాయిటర్స్ పోల్ లో వెల్లడయ్యింది. గత ఐదేం డ్లలో ఇదే గరిష్టమని పేర్కొంది. మే 11- 27 మధ్య 13 మంది ప్రాపర్టీ నిపు ణుల అభిప్రాయాలను సేకరించి ఓ రిపోర్ట్‌ను రూపొందిం చింది. వచ్చే ఏడాది, 2024లోనూ గృహాల ధర లు సగటున 6.0శాతం పెరుగొచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయప డ్డారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు ను 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40శాతానికి చేర్చడంతో పాటుగా, ముడి సరుకుల ధరలు పెరగడంతో నిర్మాణరంగ వ్య యం పెరగనుందని జేఎల్ఎల్ రీ సెర్చ్ డైరెక్టర్ రోహన్ శర్మ పేర్కొన్నారు. మధ్యస్థ, దీర్ఘకాల డిమాండ్ బలంగానే ఉండనుంద న్నారు. భవిష్యత్తు లో వడ్డీ రేట్లు మరింత పెరుగొచ్చ న్నారు. వచ్చే 2, 3 త్రైమాసి కాల్లో కొనుగోలుదారులు అవకా శాలను ఉపయోగించు కోవచ్చన్నారు. తొలి సారి గృహాలను కొను గోలు చేసే వారు మాత్రం మరో రెం డేండ్లు వేచి చూసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత, వచ్చే ఏడాదిలో ముంబయి, ఢిల్లీ, ఎన్సీఆర్ లో ధరలు 4-5 శాతం పెరుగొచ్చని నిపుణులు అంచనా వేశారు. బెంగ ళూరు, చెన్నరులలో 5.5-6.5 శాతం మధ్య ధరలు పెరుగొచ్చన్నారు.