Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసహజమరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు
కోల్‌కతా : ప్రముఖ గాయుడు కృష్ణకుమార్ కున్నాథ్ (కెకె) హఠాన్మరణం సంగీత అభిమానుల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. అప్పటి వరకూ తన గీతాలతో అలరించిన కెకె ఒక్కసారిగా మరణించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కెకె మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టు మార్టం నివేదిక ఇంకా రాకపోవడంతో కెకె మృతికి కారణాలు వెల్లడికావడం లేదు. మరోవైపు పోలీసులు కూడా అసహజమరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంగళవారం కెకె తన మరణానికి కొన్ని గంటల ముందు వరకు కూడా కోల్‌కతాలో ఒక సంగీత కచేరీలో పాల్గొన్నారు. తన పాటలతో అలరించారు. అయితే ఈ వేదిక కెకె అశాంతిగా ఉన్నట్లు కొన్ని వీడియోలు చూపిస్తున్నాయి. పాటల మధ్యలో ముఖం తడుచుకోవడానికి విరామం తీసుకున్నప్పుడు వీపరీతంగా చెమటలు పట్టినట్లు కెకె కనిపించారు. 'చాలా వేడిగా ఉంది' అని కెకె చెబుతున్నట్లుగా వీడియాలో ఉంది. అలాగే ఒక వ్యక్తికి సైగ చేస్తూ, ఎయిర్ కండిషనింగ్ గురించి మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ సంగీత కచేరి నుంచి బయటకు తీసుకెనివెళుతున్నప్పడు అతను అస్వస్థతకు గురైనట్లు మరొక వీడియాలో కనిపించింది. కార్యక్రమం నుంచి హోటల్‌కు వెళ్లాక అతని పరిస్థితి క్షీణించింది. ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలోనే కెకె మరణించారు. కెకె చివరిసారిగా ప్రదర్శన ఇచ్చిన దక్షిణ కోల్‌కతాలోని నజ్రుల్ మంచ్ ఆడిటోరియం కిక్కిరిసిపోయిందని, ప్రదర్శన సమయంలో చాలా వేడిగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 53 ఏళ్ల కెకె బాలీవుడ్‌తో తెలుగు, తమిళ, మళయాళం, కన్నడం, బెంగాలీ, అస్సాం, గుజరాతీ చిత్రాల్లోనూ పాటలు పాడారు.