Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపి రాహుల్ గాంధీలను ఎన్ఫోర్స్్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది. ఈ మేరకు బుధవారం వారికి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ స్థాపించిన యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందినది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్) దీన్ని ప్రచురిస్తోంది. యంగ్ ఇండియా లిమిటెడ్లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇటీవల కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేపట్టారు. తాజాగా మనీ లాండరింగ్ కేసులో సోనియా, రాహు ల్ను కూడా ప్రశ్నించి, వారి స్టేట్మెంట్లను నమోదు చేయాలని భావి స్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖార్గె, పవన్ బన్సాల్లను కూడా ఇడి విచారించింది.