Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్ కిల్లింగ్స్ పట్ల మోడీ ప్రభుత్వ తీరుపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ : కాశ్మీర్లో వరుసగా కొనసాగుతున్న పౌర హత్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తీవ్రంగా ఖండించారు. గత ఐదు మాసాల్లో కాశ్మీర్లో 15మంది భద్రతా సిబ్బంది, 18మంది పౌరులు హత్యకు గురయ్యారని రాహుల్ పేర్కొన్నారు. ఈ పరిస్థితులను నిరసిస్తూ గత 18 రోజులుగా కాశ్మీరీ పండిట్లు ఆందోళన జరుపుతుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టనట్లుగా 8 ఏండ్ల మోడీ పాలన ఉత్సవాలు జరుపుకోవడంలో తలమునకలై వుందని విమర్శించారు. 'ప్రధాని మోడీ గారూ...ఇదేమీ సినిమా కాదు, నేడు కాశ్మీర్‌లోని వాస్తవికత.' అంటూ రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. కాశ్మర్లోని కుల్గామ్ జిల్లాలో తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో రజని బాలా అనే హైస్కూల్ టీచర్ చనిపోయారు. అంతకు కొన్ని రోజుల ముందు కాశ్మీరీ టివి యాక్టర్ అమ్రీన్ భట్‌ను తీవ్రవాదులు కాల్చి చంపారు. మే 12వ తేదీన బుద్గామ్ జిల్లాలోని చదూరా తహసిల్ కార్యాలయంలో రాహుల్ భట్ అనే ఉద్యోగిని కాల్చి చంపారు.