Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2013లో మొత్తం నియామకాలు 1128
- 2021లో 749మంది ఎంపిక
- నియామకాలు పెంచాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచన
న్యూఢిల్లీ :యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్...నిర్వహించే సివిల్ సర్వీసెస్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సమర్థవంతమైన వ్యక్తుల్ని ప్రభుత్వ పాలనలోకి తీసుకురావటంలో యూపీ ఎస్సీ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే మోడీ సర్కార్ అధికారం చేపట్టింది మొద లు .. సివిల్స్ నియామకాలకు ప్రాధాన్యత తగ్గిస్తోంది. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాల్లోనూ నియామకాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2013లో యూపీ ఎస్సీ ద్వారా 1228మందిని సివిల్స్‌కు ఎంపిక చేయ గా, 2021లో ఆ సంఖ్య కేవలం 749కి పరిమిత మైంది. 2013లో ఐఏఎస్ కేడర్‌కు 180 మందిని ఎంపిక చేయగా, ఇప్పుడూ అదే సంఖ్యలో నియా మకాలు జరిగాయి. మోడీ సర్కార్ సివిల్స్ నియా మకాలను కావాలనే కుదిస్తోందన్న విమర్శ ఉంది. ఏడాది క్రితం ఐఏఎస్ కేడర్ రూల్స్‌కు కేంద్రం అనేక మార్పులు చేసింది. ఇది కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాం శమైంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రతి పక్షాలు కేంద్రం నిర్ణయాన్ని తప్పు బట్టాయి.
ఈ ఏడాది మార్చిలో సివిల్స్ నియామకాలపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపింది. నియామకాల సంఖ్య పెంచాలని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐఏఎస్‌ల కొరత తీవ్రస్థాయిలో ఉందని, అటు రాష్ట్రాలు సైతం ఇబ్బంది పడుతు న్నాయని తెలిపింది. అయితే ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అవ సరాలు, మంత్రిత్వ శాఖల సంఖ్యను దృష్టిలో పెట్టు కొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల నియామకం పెంచాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలో పనిచేసి రిటైర్ అయిన మాజీ ఐఏఎస్ వి.రామన్ అన్నారు.
సమూలంగా మార్చాలనుకుంటోంది..
సివిల్స్-2013లో మొత్తం 1228మంది ఎంపిక కాగా, అందులో ఐఏఎస్‌లు-180, ఐఎఫ్ఎస్లు -32, ఐపీఎస్‌లు-150, కేంద్ర సర్వీసుల కింద గ్రూప్-1 ఆఫీసర్‌గా 710మందిని తీసుకున్నారు. తాజాగా విడుదలైన 2021 సివిల్ ఫలితాలు పరిశీ లిస్తే, ఐఏఎస్‌కు -180, ఐఎఫ్ఎస్-32, ఐపీఎస్ -150, గ్రూప్-ఏ ఆఫీసర్లు 710మందిని ఎంపిక చేశారు. ''బహుశా ఈ వ్యవస్థ(సివిల్స్, ఐఏ ఎస్, ఐపీఎస్)ను సమూలంగా మార్చాలని మోడీ సర్కార్ భావిస్తోంది. పోస్టింగ్‌లు జారీచేయటం లోనూ కొన్ని సమస్యలు ఎదురవుతు న్నాయని కేంద్రం భావిస్తోంది'' అని మరో మాజీ ఐఏఎస్ ప్రముఖుడు వెల్లడించారు.