Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాలోనూ కాసుల కక్కుర్తి!
- అసోం బీజేపీ ప్రభుత్వ ఘనత
గువహతి : అవినీతికి తాము బారెడు దూరమని చెప్పుకునే బీజేపీ నేతల కాసుల కక్కుర్తి ఇది! కరోనా కష్టకాలంలో ప్రజలంతా ప్రాణాలను కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్న వేళ .. ఆ మహమ్మారినే అడ్డం పెట్టుకుని అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన ఉదంతం ఇది! అది కూడా ఏ ఛోటా మోటా నాయకుడి అవినీతి కాదు. ఏకంగా ముఖ్యమంత్రి భార్యకే నిబంధనలను బేఖాతరు చేసి పీపీఈ కాంట్రాక్టులు కట్టబెట్టిన వైనం అసోంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆరు నెలల పాటు పోరాటం చేస్తే కానీ ఈ అవినీతి భాగోతం బట్టబయలు కాలేదు. కరోనా మొదటి, రెండవ వేవ్ సమయాల్లో పిపిఇ కిట్లకు భారీ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిని అవకాశంగా తీసుకుని కొటేషన్లు, టెండర్ల వంటి విధివిధానాలను పూర్తిగా విస్మరించి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రింకి భుయాన్ శర్మకు చెందిన సంస్థకు పీపీఈ కిట్ల సరఫరా కాంట్రాక్టును అప్పచెప్పారు. అదే విధంగా వారి కుటుంబ వ్యాపార భాగస్వామికి కూడా మరో కాంట్రాక్టును అప్పచెప్పారు. వీరిరువురికి చెందిన మూడు సంస్థలకు పిపిఇ కాంట్రాక్టులను నిబంధనలను విరుద్ధంగా అప్పచెప్పినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా లభించిన పత్రాల్లో స్పష్టమైంది.
శానిటరి నాప్కిన్లు తయారు చేసే సంస్థ!
మొదటి విడత కరోనా విజృంభించిన సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అస్సోం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన భార్య రింకి శర్మకు గౌహతిలో జేసీబీ ఇండస్టీస్ పేరిట శానిటరీ నాప్కిన్లు తయారు చేసే సంస్థ ఉంది. ఆసంస్థకు మెడికల్ పీపీఈ కిట్లు కానీ, ఇతర వైద్య పరికరాలు కానీ తయారు చేసిన చరిత్ర అప్పటి వరకు లేదు. అయినా అత్యవసరంగా 5 వేల పీపీఈ కిట్లు తయారు చేసి ఇచ్చే ఆర్డర్‌ను ఆ సంస్థకే వైద్య ఆరోగ్యశాఖ అప్పగించింది, మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే 2020 మార్చి 24వ తేది రాత్రి నుండి దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించగా, ఈ అత్యవసర ఆర్డర్ మార్చి 18వ తేదినే రింకి శర్మ సంస్థకు అందింది. జేసీబీ ఇండిస్టీస్తో పాటు జిఆర్డి ఫార్మా స్యూటికల్స్, మెడిటైమ్ హెల్త్‌కేర్ సంస్థలకు కూడా ఈ తరహా అత్యవసర పీపీఈ కిట్ల ఆర్డర్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నుండి అందాయి. వీటిని హిమాంత కుటుంబ వ్యాపార బాగస్వామి అయిన ఘన్‌శ్యామ్ ధనూకా నిర్వహిస్తున్నారు. వశిష్ట రియల్టర్స్ పేరిట ఘన్‌శ్యామ్ నిర్వహిస్తున్న మరో సంస్థలో హిమంత శర్మ కుమారుడు నందిల్ బిశ్వ శర్మ ప్రధాన వ్యాపారభాగస్వామి! దీనిని బట్టే ఈ ఆర్డర్లు లభించడానికి ప్రాతిపదిక ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
అత్యావసరానికి ఇవ్వలేదు ..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అత్యవసరం పేరిట ఈ సంస్థలకు ఆర్డర్లు అందినప్పటికి ముఖ్యమంత్రి భార్య సంస్థతో పాటు, ఆయన వ్యాపార భాగస్వామికి చెందిన మరో సంస్థ ఈ డిమాండ్‌ను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ ఆ తరువాత కూడా వారికి ఆర్డర్లు కొనసాగాయి.