Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : నగరంలో కరోనా పాజిటివిటీ రేటు ఆరు శాతానికి పెరిగినందున కరోనా పరీక్షలను వేగవంతం చేయనున్నట్టు బహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. యుద్ధ ప్రాతిపదికన పరీక్షలను పెంచాలనీ, టెస్టింగ్ ల్యాబ్‌లు కూడా పూర్తి సిబ్బందితో పనిచేయాలని ఆదేశించింది. మంగళవారం ముంబయిలో 506 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 6 (536 కేసులు) అనంతరం మరోసారి మే 31న అత్యధిక కేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ముంబయిలో రోజువారీ కొత్త కేసులు విపరీతంగా పెరిగాయనీ, మరికొన్ని రోజుల్లో వర్షాలు పడనున్నాయని.. దీంతో కరోనా వ్యాప్తి అధికం కావచ్చని హెచ్చరించారు. అలాగే 12-18 వయస్సుల వారికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని, అలాగే అర్హులైన వారికి బూస్టర్ డోసులను అందించాలని బీఎంసీ ఆదేశించింది.