Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ సీఎం విజయన్
తిరువనంతపురం : ప్రజల మద్దతుతో, ఉప్పొంగిన ఉత్సాహంతో తమ ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. తమ ప్రభుత్వ పాలన ప్రజా మద్దతు కూడగట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తిరుగులేని నిబద్ధతతో తన బాధ్యతలను నిర్వర్తించిందని అన్నారు. 'రాష్ట్రం అనేక విజయాలు సాధించింది. 2021 ఎన్నికల మ్యానిఫెస్టోలో.. నవ కేరళ నిర్మాణానికి 900 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నది. కొత్త తరం కోరుకునే ఆధునిక ఉద్యోగ మార్గాలను సృష్టించేందుకు ప్రభుత్వం భారీ పురోగతి సాధించింది. ఎన్నికల మ్యానిఫెస్టో లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రత్యేక శ్రద్ధ అవసరమ్యే రంగాలున్నాయి. వాటిపై దృష్టి సారిస్తాం. 100 రోజులు 100 ప్రాజెక్టుల పథకాన్ని తీసుకువచ్చాం. గత ఏడాది నుంచి రెండు సార్లుగా ఈ ప్రాజెక్టును అమలు చేశాం' అని తెలిపారు. లైఫ్ మిషన్ కింద పేదల కోసం 2.95 లక్షలకు పైగా నివాసాలను అందించామనీ, 114 ఫ్లాట్ కాంప్లెక్సులను పూర్తి చేశామని పేర్కొన్నారు. 15వేల టైటిల్డీడ్లు అందజేయాలని భావిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 33,530 అందజేశామన్నారు. 3570 జారీకి సిద్ధంగా ఉన్నాయనీ, 20,750 కార్యాలయాలకు కె ఫోన్ను అమర్చామన్నారు. 14 వేల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ అందించే ప్రాజెక్టు పురోగతిలో ఉందని, 3.95 లక్షల ఉపాధి కల్పించామని తెలిపారు.