Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ కేటాయింపులో ఆశించినంతగా కనబడని మార్పు
- లింగ అసమానతలు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి
- నిపుణుల ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలోని వృద్ధులకు అందే పింఛనుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నది. వారికి అందించే పింఛన్లలో పెరుగుదల అంతగా ఉండక పోవటమే గాక లింగ అసమానతలు కనిపిస్తున్నాయి. కొన్ని గణాంకాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతు న్నది. 2007 నుంచి కేంద్రం వృద్ధులకు రోజుకు రూ. 7 నుంచి రూ. 16 మాత్రమే ఇస్తున్నదని తెలుస్తున్నది. కొన్ని రాష్ట్రాలు వృద్ధాప్య పింఛన్ పథకం కింద అర్హులకు అందించే మొత్తాన్ని పెంచుతున్నట్టు ప్రకటించాయి. ఈ ఏడాది చివర్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు వృద్ధాప్య పింఛనును రూ. 6000కి పెంచుతామని వాగ్దానాలను ఇస్తున్నాయి. అయితే, కొన్ని రాష్ట్రాలలో మాత్రం వృద్ధాప్య పింఛనులో పెరుగుదల చాలా తక్కువగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పథ కం కింద అందే పింఛన్ మొత్తం స్తబ్దుగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తక్కువగా ఉన్నది. కేంద్రం, రాష్ట్రాల స్థాయిలో అనేక అసమానతలున్నాయి. వృద్ధాప్య లబ్దిదారు లకు చెల్లించే మొత్తం రాష్ట్రాలలో భారీ వ్యత్యాసాలు దర్శనమిస్తున్నాయి. అసోం, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇది నెలకు రూ. 300గా ఉంటే.. తెలంగాణలో రూ. 2016 వరకు ఉన్నది.
2021లో భారత్‌లో వృద్ధుల సంఖ్య దాదాపు 13.7 కోట్ల మందిగా అంచనా ఉన్నది. ఇందులో మహిళలు 51 శాతంగా ఉన్నారు. కొన్ని అంచనాల ప్రకారం.. దాదాపు ఎనిమిది కోట్ల మంది వృద్ధాప్య పింఛనుకు అర్హులు. అయితే, 2.5 కోట్ల మంది మాత్రమే పింఛను పొందుతుండటం గమ నార్హం. అర్హతగల వృద్ధుల సంఖ్య, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తర్వాత, పెరిగినప్పటికీ.. వృద్ధాప్య పింఛను పథకానికి కేంద్రం నుంచి కేటాయింపులు నిలిచిపోయాయి. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం (ఐజీఎన్ ఓఏపీఎస్) కోసం 2020-21, 2021-22 రెండింటి లోనూ బడ్జెట్ కేటాయింపు రూ. 6,259 కోట్లుగా ఉన్నది. అయితే, అది 2022-23 బడ్జెట్లో రూ. 6564 కోట్లకు స్వల్పంగా మాత్రమే పెంచబడటం గమనించాల్సిన అంశం.
లింగ భేదం
ఇటీవలి డేటా అనేక రాష్ట్రాల్లో ఐజీఎన్ఓఏపీఎస్ కింద పింఛన్‌ను పొందుతున్న పురుషుల నిష్పత్తి మహిళల కంటే ఎక్కువగా ఉన్నదని వెల్లడిస్తున్నది. ఈ రాష్ట్రాల్లో చాలా వరకు ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళల నిష్పత్తి పురు షుల కంటే చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. హి మాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, ఉత్తరా ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో మహిళలతో పోలిస్తే ఎక్కువ శాతం పురుషులు ఐజీఎన్ఓఏపీఎస్ కింద ప్రయోజనాలను పొందుతున్నారని సమాచారం. చాలా రాష్ట్రాల్లో పురుషుల కంటే ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళల నిష్పత్తి ఎక్కువగా ఉందని డేటా వెల్లడిస్తున్నది. వృద్ధ మహిళలకు తగిన సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని ఇది స్పష్టంగా తెలియజేస్తున్నదని నిపుణులు చెప్పారు. దీనిపై ఆయా ప్రభుత్వాలు దృష్టి పెట్టి వృద్ధులకు న్యాయం చేయాలని సూచించారు.