Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన పాటిదార్ నేత హార్ధిక్ పటేల్ బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు సిఆర్ పాటిల్, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్‌లు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. 'జాతీయ, రాష్ట్ర, సామాజిక, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఈ రోజు నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నా. ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో దేశానికి సేవ చేసే పనిలో భాగంగా నేను ఒక చిన్న సైనికుడిలా భాగస్వామ్యం కానున్నాను' అని హార్థిక్ హిందీలో ట్వీట్ చేశారు. గత నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన హార్థిక్ పటేల్.. బీజేపీలో చేరుతాడని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ.. ఆయన తమ పార్టీలో చేరబోతున్నారంటూ ఇటీవల గుజరాత్ బీజేపీ మీడియా కన్వీనర్ యగేష్ దావే తెలిపారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న తరుణంలో హార్థిక్ బీజేపీలో చేరడం గమనార్హం.