Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్ ప్రభుత్వం
చంఢగీఢ్ : 424 మందికిపైగా వీవీఐపీలకు జూన్ ఏడు నుంచి భద్రతను పునరుద్ధరిస్తున్నట్టు పంజాబ్ ప్రభుత్వం గురువారం ప్రకటిం చింది. వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించిన మరుసటి రోజే సింగర్ సిద్ధూ హత్యకు గురయ్యారు. దీంతో ప్రతిపక్షాలు ఆప్ ప్రభుత్వంపై ఆగ్ర హం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీవీఐపీల భద్రత తొల గింపుపై మాజీ మంత్రి ఓపీ సోనీ పంజాబ్ హర్యానా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు నేడు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా వీవీఐపీలకు భద్రత ఎందుకు తొలగించాల్సి వచ్చిందని హై కోర్ట్ భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జూన్ 6న 'ఆప రేషన్ బ్లూస్టార్' వార్షికోత్సవం నేపథ్యంలో భద్రతా సిబ్బంది అవసరం ఏర్పడిం దని భగవంత్ మాన్ కోర్టుకు తెలిపారు. 1984లో స్వర్ణ దేవాలయాన్ని ముట్టడించిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు 'ఆపరేషన్ బ్లూస్టార్' నిర్వహించింది.