Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: శాశ్వత ఉద్యోగులకు ఎయిరిండియా షాకిచ్చింది. ఈ సం స్థలో శాశ్వత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకాన్ని ప్రకటించింది. శాశ్వత ఉద్యోగుల సం ఖ్యను తగ్గించడంతో పాటు వివిధ వి భాగాల్లో నియామక ప్రక్రియను చేపట్ట నున్నట్టు వివరించింది. అప్పుల్లో కూ రుకుపోయిన ఎయిరిండియాను ఇటీ వల టాటా గ్రూప్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 20 ఏండ్ల సర్వీసు పూర్తిచేసుకొని 55 ఏండ్లు పైబడిన వారు ఈ వీఆర్ఎస్ను ఎంచుకోవచ్చ ని,క్యాబిన్ సిబ్బంది అయితే 40 ఏండ్లు పైబడిన వారు తీసుకోవచ్చని వీఆర్ ఎస్ మెమోలో ఎయిరిండియా పేర్కొ ంది. వీఆర్ఎస్ను ఎంచుకున్నవారికి ఎక్స్‌గ్రేషియాతో పాటు అదనంగా ప్రో త్సాహకాలు కూడా అందిస్తామని తెలి పింది. వీఆర్ఎస్ తీసుకోవాలను కుం టున్న ఉద్యోగులు జూన్ 1 నుంచి జూన్ 30 మధ్య తమ ప్రాంతీయ అధి కారిని సంప్రదించాలని సూచించింది. అదే సమయంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ప్రత్యర్థి కంపెనీలకు చెందిన ఉద్యోగు లతో పాటు టాటా గ్రూప్‌లోని మిగి లిన సంస్థల్లో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఎయిరిండియా లోని కీలక పదవుల్లో నియమిస్తున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. సంస్థలో మొత్తం 12,085 మంది ఉ ద్యోగులు ఉన్నారు. వారిలో 8,084 మంది శాశ్వత ఉద్యోగులు, 4,001 కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 1,534 మంది ఉద్యోగు లు విధులు నిర్వహిస్తున్నట్టు ఎయిరిం డియా సీఎండీ రాజీవ్ బన్సాల్ ఒక నివేదికలో తెలిపారు.