Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏప్రిల్‌లో భారత్‌కు చెందిన 16 లక్షలకు పైగా వాట్సప్ ఖాతాలపై ఆ సంస్థ నిషేధం విధించింది. బుధవారం విడుదల చేసిన ఏప్రిల్ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు వాట్సప్ వెల్లడించింది. యూజర్ల నుంచి 844 ఫిర్యాదులు రాగా.. 122 ఖాతాలపై నిషేధం విధించగా.. యాప్‌లో హానికరమైన కార్యాకలాపాలను నిరోధించేందుకు 16.66 లక్ష ల ఖాతాలపై వేటు వేసింది. 'మేం ముఖ్యంగా భద్రతపై దృష్టిసారించాం. హానికరమైన కార్యాకలాపాలు జరిగిన తర్వాత గుర్తించడాని కంటే ముం దు.. అవి జరగకుండా నిరోధించడం మంచిదని భావిస్తున్నాం' అని పే ర్కొంది. వాట్సప్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం.. వినియోగదారుడు అనుచిత కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సమాచారం అందగానే ఖాతాను నిలిపివేస్తున్నామని తెలిపింది. దుర్వినియోగమవుతున్న ఖాతాలను గుర్తించడం మాన్యువల్‌గా సాధ్యం కానందున అధునాత మెషీన్ లెర్నింగ్ సిస్టమ్‌ను తెచ్చామని పేర్కొంది. ఇది 24 గంటలు 7 రోజుల పాటు దుర్వి నియోగమవుతున్న ఖాతాలను తొలగిస్తుందని వాట్సప్ వెల్లడిం చింది. మార్చిలో 18 లక్షల ఖాతాలు, ఫిబ్రవరిలో 14.26 లక్షలకు పైగా ఖాతా లపై వాట్సప్ నిషేధం విధించింది.