Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్లో పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటోన్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా కుల్గాంలో ఓ బ్యాంకు మేనేజర్‌ను పొట్టనబెట్టుకున్నారు. గడిచిన మూడు రోజుల్లో ఇది రెండవ హత్య. మృతుడు రాజస్థాన్‌కు చెందిన విజరు కుమార్‌గా గుర్తించారు. ఆయన ఇలాఖాహి దేహతి బ్యాంక్ మేనేజర్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల కాల్పులు జరిపి గాయపడ్డ బ్యాంకు మేనేజర్‌ను అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.