Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్బుర్గి జిల్లా కమలాపురంలో మినీ లారీని ఢకొీన్న ప్రయివేట్ ట్రావెల్స్
- ఏడుగురు హైదరాబాద్ వాసుల మృతి
- ముగ్గురి పరిస్థితి విషమం
నవతెలంగాణ-సిటీబ్యూరో
కర్నాటక రాష్ట్రం కాల్బుర్గి జిల్లా కమలాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు చనిపోయారు. ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు మినీ లారీని ఢకొీనడంతో ఈ ప్రమాదం జరిగింది. గోవాలో పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు హైదరాబాద్ నుంచి రెండు కుటుంబాల వారు 32 మంది గోవా వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. డ్రైవర్ సహా 35 మందితో కూడిన ప్రయివేటు బస్సు గురువారం రాత్రి గోవా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో ఒక కుటుంబానికి చెందిన 11 మంది.. మరో కుటుంబానికి చెందిన 21 మందితో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. తెల్లవారుజామున కర్నాటకలోకి ప్రవేశించిన ట్రావెల్స్ బస్సు బీదర్- శ్రీరంగ పట్టణం హైవే నుంచి వెళ్తున్న క్రమంలో.. కమలాపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మినీ లారీని బస్సు ఢకొీట్టింది. అనంతరం రోడ్డు పక్కన బోల్తా పడింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు అంతటికి వ్యాపించడంలో పలువురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బస్సు అద్దాలు పగుగొట్టి కొందరిని కాపాడారు. అయితే ఈ లోపే మంటలు విస్తరించడంతో బస్సులో చిక్కుకున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరోవైపు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన అధికారులు వైద్యం కోసం గాయపడిన వారిని కలబురిగి జిల్లా ఆస్పత్రితో పాటు యునైటెడ్, గంగా ఆస్పత్రులకు తరలించారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం కోల్పోయారు. చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి డాక్టర్లు తెలిపారు. మినీ లారీ డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందినదిగా అధికారులు పేర్కొన్నారు. ప్రమాదంలో బీవన్, దీక్షిత్, రవళి, సరళాదేవి, అర్జున్ శివకుమార్, అనితారాజు, శివకుమార్ చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని బాధిత కుటుంబాల బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.