Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎఫ్‌పై 8.1 శాతం వడ్డీకి కేంద్రం ఆమోదం
- 43 ఏండ్లలోనే అతి కనిష్టం
న్యూఢిల్లీ : ఐదు కోట్ల ఉద్యోగ, కార్మికులకు మోడీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22)కు గాను ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. పీఎఫ్‌పై ఇంత తక్కువ వడ్డీ రేటు ఇవ్వడం 1977-78 తర్వాత ఇదే తొలిసారి. 2020-21లో 8.5 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. 2021-22కు గాను వడ్డీ రేటును 43 సంవత్సరాల కనిష్ట స్థాయికి కుదిస్తూ గడిచిన మార్చిలో ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్‌కు సంబంధించిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో ఈ పత్రాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మతికి పంపించింది. ఆర్థిక శాఖ అనుమతి తర్వాత ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీని జమ చేయనున్నారు. ఆర్థిక సంవత్సరం 1977-78లో పీఎఫ్‌పై 8 శాతం వడ్డీ ఇచ్చారు. ఆ తర్వాత భారీగా తగ్గించడం ఇదే తొలిసారి.