Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లయినా సమస్యలన్నీ పెండింగ్లోనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్ జోనల్ కమిటీ సమావేశంలో ప్రస్తావించిన విభజన సమస్యలు, వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల్లో జరిగిన చర్చల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు పూర్తి అయినా ఇప్పటికీ ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ కూడా పెండింగులో ఉన్నాయనీ, వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని సీఎం మరోమారు కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు రాష్ట్రానికి చెందిన పలు అంశాలపైన కూడా చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లి బయలుదేరారు.