Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 300 మందికి అస్వస్థత ొబాధితులంతా మహిళలే
- ఏపీలోని విశాఖలో ఘటన
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోగల బ్రాండిక్స్ సెజ్‌లోని సీడ్స్ కంపెనీ ఎం-1, ఎం-2 విభాగాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అమోనియా గ్యాస్ లీకైంది. మంటలు కూడా వ్యాపించాయి. ఈ ఘటనలో సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 150 మందికిపైగా అచ్యుతాపురం, అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురు గర్భిణులు ఉన్నారు. అనకాపల్లికి చెందిన ఐదు నెలల గర్భిణి కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటికి ఒకేసారి గ్యాస్ లీకవడంతో మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సీడ్స్ కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు 1,500 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. గ్యాస్ లీకవడంతో వారంతా పరుగులు తీశా రు. గ్యాస్ ఎక్కువ పీల్చిన కార్మికులు అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. మెయిన్ గేట్ దగ్గర, రోడ్లపైనా కొంతమంది కార్మికులు వాంతులు చేసుకున్నారు.
ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలి : సీపీఐ(ఎం), సీఐటీయూ
సీడ్స్‌లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధితుల ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్య సౌకర్యం అందించాలని వారు డిమాండ్ చేశారు.