Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పినరయి విజయన్
తిరువనంతపురం : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తమ ప్రభుత్వం ఆమలు చేసే ప్రసక్తే లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన ఎల్డీఎఫ్ ప్రభుత్వం.. ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విజయన్ మాట్లా డుతూ.. 'సీఏఏ అమలుపై మేం స్పష్టమైన వైఖరి తోనే ఉన్నాం. ఇప్పుడు ఆ వైఖరినే కొనసాగిస్తాం' అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాద సిద్ధాంతంతోనే మన దేశం పనిచేస్తోందని అన్నారు. కానీ ఈ రోజుల్లో లౌకికవాదాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, దీని పట్ల కొంతమంది ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలు చూస్తే.. మత ప్రాదిపదికన పౌర సత్వాన్ని నిర్ధారించేందుకు కొంతమంది సభ్యులతో కూడిన బృందం ప్రయత్ని స్తున్నదని పేర్కొన్నారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం గట్టి వైఖరిని తీసుకుంటుందని తెలిపారు. 'ప్రజల మధ్య మతకల్లోలాలు రెచ్చగొట్టేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సర్వేలు జరగుతు న్నాయి. కానీ ఇక్కడ మన సమాజంలో పేద కుటుంబాలను గుర్తించేం దుకు కేవలం ఒక్క సర్వే జరిగింది. ఈ సర్వేలో భాగంగా తదుపరి చర్యలు తీసుకుంటాం' అని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీఏఏ అమలు చేయబోమని పునరుద్ఘాటించారు. మతం ఆధారంగా పౌరసత్వాన్ని నిర్ధారించకూడదని రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన వైఖరిని తీసుకుందని విజయన్ అన్నారు.