Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమీషన్ల కోసం 'ఉపాధి' కూలీలపై ఆ పార్టీ నాయకుల బలవంతం
- త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్
అగర్తల : త్రిపురలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి మరో పేరు అని సీపీఐ(ఎం) నాయకులు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. వచ్చే ఏడాది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే ప్రజలు తప్పు చేసినవారవుతారని తెలిపారు. ' మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)' కింద లబ్దిదారులకు వచ్చే వేతనాల నుంచి 'కమీషన్ చెల్లించాలని' వారిపై బీజేపీ నాయకులు బలవంతం చేస్తున్నారని మాణిక్ సర్కార్ ఆరోపించారు. '' ఉపాధి పనుల్లో యంత్రాలను ఉపయోగించటంపై నియంత్రణ ఉన్నది. అయినప్పటికీ, గ్రామీణ ఉపాధి కార్యక్రమంలో మెషనరీని భారీగా ఉపయోగిస్తున్న విషయం మాకు తెలిసింది'' అని ఆయన తెలిపారు. ''లబ్దిదారుని రోజువారి కూలీలో సగం స్థానిక బీజేపీ నాయకుల జేబుల్లోకే వెళ్తున్నది. కూలీల నుంచి వీరు కమీషన్ అడుగుతున్నారు''. అని తెలిపారు. ఉనాకోటి జిల్లాలో గ్రామీణ ఉపాధి పథకం కింద సగటున 20-25 మానవ- పనిదినాలు కల్పించబడ్డాయని పేర్కొంటూ జిల్లా మేజిస్ట్రేటు యూ.కే. చక్మాకు ఆయన రిప్రజెంటేషన్‌ను అందించారు. అయితే, జిల్లాకు సంబంధించి అధికారిక సమాచారంలో ఇది సగటున 70 మానవ-పనిదినాలు కల్పించబడినట్టు ఉన్నదని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్దిదారుల జాబితాలో అనేక పేద కుటుంబాల పేర్లు లేవని వివరించారు.