Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికపై లైంగికదాడి
న్యూఢిల్లీ : దేశంలోని మహిళలపై దారుణాలకు అడ్డుకట్టపడటం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. వారికి భద్రత మాత్రం ఉండటం లేదు. ఇందుకు దేశరాజధాని ఢిలీల్లో చోటు చేసుకున్న దారుణ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. తొమ్మిదేండ్ల బాలికపై పొరుగున ఉండే తెలిసిన వ్యక్తి లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ అమానుష ఘటన ఈశాన్య ఢిల్లీలోని న్యూ శీలంపూర్ ప్రాంతంలో చోటు చేసుకున్నది. పోలీసుల, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఏపీసీ ఆస్పత్రికి తరలించాం. బాలికపై లైంగికదాడి జరిగిందని వైద్య పరీక్షలో తేలింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి ఐపీసీలోని పలు సెక్షన్లు, పోక్సో చట్టంలోని ఆరో సెక్షన్ కింద పోలీసులు కేసును నమోదు చేశారు. బాధితురాలి ఇంటికి దగ్గరలో ఉండే ఒక ఫ్యాక్టరీలో పని చేసే వ్యక్తి (46) ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు తాను పని చేసే ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి దారుణానికి తెగబడ్డాడు. బాధితురాలు చిన్నప్పటి నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నదని పోలీసులు చెప్పారు. నిందితుడు ఆ బాలికకు తెలిసిన వ్యక్తేనని వివరించారు. బీహార్‌కు చెందిన సదరు నిందితుడిని పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, పౌర సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.