Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెక్డామ్లో మునిగి ఏడుగురు బాలికల మృతి
చెన్నై : తమిళనాడులోని కడలూరుకు సమీపంలోని గెడిలం నదిపై నిర్మించిన చెక్డామ్లో మునిగి ఏడుగురు బాలికలు చనిపోయారు. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో కడలూరులోని కుచిపాలెం సమీపంలో గెడిలం నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌లో 10-18 ఏళ్ల వయసు గల ఏడుగురు బాలికలు స్నానానికి దిగి మునిగిపోయారు. మృతులను ఎ మోనిషా (16), ఎం నవనీత (18),కె. ప్రియ (18), ఎం కుముద (18), సంఘవి (16), ఆర్. ప్రియదర్శిని (15), ఆమె చెల్లి దివ్యదర్శిని (10)గా గుర్తించారు. అక్కడ ఉన్న వారి కేకలు విని, కొంతమంది నదిలో దిగి వారిని బయటకు తీశారు. వారందరినీ కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అక్కాచెల్లెల్లయిన ప్రియదర్శిని, దివ్యదర్శినిది అయంకురిన్జిపడి గ్రామం. మిగిలిన వారంతా కుచ్చిపాలయం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.