Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు లోయలో పడి 22 మంది మృతి
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. యమునోత్రి జాతీయ రహదారిపై యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఉత్తర కాశీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది యాత్రీకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ఉన్నారు. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన యాత్రీకులు యమునోత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సహాయక దళాలు అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. స్థానిక ఆధికారులతో పాటు, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు (ఎస్డిఆర్ఎఫ్) సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ దళాలు (ఎన్డిఆర్ఎఫ్) కూడా సంఘటనా స్థలానికి చేరుకోనున్నాయి. ఘటనపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.