Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందూత్వ..సంఫ్‌ు పరివార్ పదాలు తొలగింపు
- కేసుల్లో ఇరుక్కుంటామని భయపడుతున్న పెంగ్విన్ పబ్లిషర్స్!
న్యూఢిల్లీ : విప్లవకవి, పౌర హక్కుల కార్యకర్త వరవరరావు ఆరు దశాబ్దాలుగా రాసుకున్న అనేక పద్యాలు, కవితల్ని ఆంగ్ల అనువాదంతో పుస్తకం తీసుకురావాలన్న లక్ష్యానికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. 'వరవరరావు : ఎ రివాల్యూషనరీ పోయెట్' అనే పుస్తకంలో హిందూత్వ, సంఘ్ పరివార్, కాషాయీకరణ...వంటి పదాల్ని తొలగించినట్టు పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇటీవల తెలిపింది. ప్రచురణ సంస్థకు చెందిన లీగల్ టీం అభ్యంతరం వ్యక్తం చేయటంతో ఆ పదాల్ని తొలగించినట్టు పెంగ్విన్ తెలిపింది. పరువు నష్టం, రాజద్రోహం..వంటి కేసులు పాలకుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం పబ్లిషర్స్ వ్యక్తం చేశారు. బీమా కోరేగావ్ కేసులో వరవరరావు ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై ముంబయిలో ఉన్నారు. ఆయన ఆరు దశాబ్దాలకుపైగా రాసుకున్న పలు కవితలు, పద్యాలు, గేయాల్ని ఆంగ్లంలోకి అనువాదం చేస్తూ రూపొందించిన రచనా సంకలనాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది. అయితే పుస్తకం ఇంకా విడుదల కాలేదు. త్వరలో విడుదల చేసేందుకు పబ్లిషర్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. తన పుస్తకంపై సెన్సార్‌షిప్‌కు సంబంధించి వరవరరావు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. మెడికల్ బెయిల్‌పై ఉన్న ఆయన మీడియాతో మాట్లాడకూడదన్న నిబంధన ఉందని, అందువల్లే స్పందించలేదని తెలిసింది. ఈ పుస్తకాన్ని విడుదల చేయటంలో పెంగ్విన్ పబ్లిషర్స్ చాలా ఆలస్యం చేశారని సమాచారం. అక్టోబర్ 2022కల్లా పుస్తకాన్ని బయటకు తీసుకురాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని వరవరరావు ఇప్పటికే తెలియజేశారట.