Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వేశాఖ ఉత్తర్వులు
న్యూఢిల్లీ : ఐఆర్సిటిసి వెబ్సైట్, యాప్ ద్వారా ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్ పరిమితిని ఇండియన్ రైల్వే పెంచింది. ఆధార్ లింకు చేయని వినియోగదారు డు ఐడి ద్వారా నెలలో గరిష్టంగా 6 టిక్కెట్లను బుక్ చేసుకునే పరిమితిని 12 టిక్కెట్లకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింకు చేసిన వినియోగదారుడు ఐడి ద్వారా నెలలో గరిష్టంగా 12 టిక్కెట్లను బుక్ చేసుకునే పరిమితిని 24 టిక్కెట్లకు పెంచాలని నిర్ణయించింది.