Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 'ది వైర్' జర్నలిస్టులు, రిపోర్టర్లు, ఫ్రీలాన్సర్లను హ్యూమన్ రైట్స్ అండ్ రెలీజియస్ ఫ్రీడమ్ (హెచ్ఆర్ఆర్ఎఫ్) జర్నలిజమ్ అవార్డ్స్ -2022కి తుది జాబితాకు ఎంపికయ్యారు. కుల, మతతత్వం, విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి రిపోర్టింగ్‌లు ఉన్నాయని పేర్కొంది. హెచ్ ఆర్ఆర్ఎఫ్ అవార్డుల్లో ఐదు విభాగాలను ఎంపిక చేసింది. వాటిలో బెస్ట్ టెక్ట్స్ రిపోర్టింగ్, బెస్ట్ ఫోటో స్టోరీస్, బెస్ట్ వీడియో స్టోరీ, హెచ్ఆర్ఆర్ఎఫ్ యంగ్ జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్, హెచ్ఆర్ఆర్ఎఫ్ బెస్ట్ మీడియా ఆర్గనై జేషన్ విభాగాలు ఉన్నాయి. షార్ట్‌లిస్ట్‌లో ఉన్న ఈ అభ్యర్థులు దేశమంత టా 100 కంటే ఎక్కువ రిపోర్ట్లు చేశారనీ, కేటగిరీల వారీగా ఎంపిక చేయబడ్డారని వైర్ మీడియా తెలిపింది. విజేతలను జూన్ 19న ఆదివారం ప్రకటిస్తారని వెల్లడించింది.హెచ్ఆర్ఆర్ ఎఫ్ యంగ్ జర్నలిస్ట్ విభాగం కింద అలీషాన్ జాఫ్రి (ఫ్రీలాన్స్ జర్నలిస్ట్) ఎంపికయ్యారు. జాఫ్రి దేశంలో జరుగుతున్న మతత త్వం, ఢిల్లీ అల్లర్లకు కారణమైన హిందూత్వ కార్యకర్తలు, నేతలపై నివేది కలు సమర్పించారు. అలాగే సోషల్‌మీడియాలో ద్వేషాన్ని ప్రసారం చేస్తు న్న విధానంపై, ల్యాండ్ జిహాద్, రెడ్ జిహాద్ అంశాలపై పలు స్టోరీలు సమర్పించారు.
ఇస్మాత్ అరా ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
కుల, మతతత్వాలను ప్రయోగించడం, విద్వేషాలను రెచ్చగొట్టడంపై పలు రిపోర్ట్లు ఇచ్చారు. యుపిలోని ముస్లిం యువకుడిపై లవ్ జిహాద్ కేసు పేరిట జరిగిన హింస, ఢిల్లీలోని జామియా నగర్‌లోని ఆలయ ఆక్రమణ అనంతరం వివరాలపై షార్ట్‌స్టోరీస్ ఇచ్చారు. నవోమి క్లారెట్ బార్టన్... అధికార పార్టీ రాజకీయ నేతల ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాలపై నివేదికలనిచ్చారు.ది క్వింట్ మీడియాకు చెందిన ఫాతిమాఖాన్.. మతతత్వం, రాజస్తాన్ గిరిజన సంఘాలు, హిందూ సంస్థల మధ్య విభేదాలపై ప్రత్యేక వ్యాసాలను రాశారు. స్క్రోల్ డాట్ ఇన్ కి చెందిన ఐశ్వర్య ఎస్.అయ్యర్ హిందూత్వ కార్యకర్తలు బాలల సంరక్షణ సంస్థను ఎలా ఆక్రమించుకున్న అంశంపై రిపోర్టింగ్ సమర్పించారు.