Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చేతులు కాలాక..ఆకులు పట్టుకోవటమంటే ఇదేనేమో! నుపుర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించి ఉంటే నేడు అంతర్జాతీయంగా భారత్ ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉండేది కాదేమో! గల్ఫ్ దేశాల నుంచి ఆగ్రహం వ్యక్తమయ్యాక...మోడీ సర్కార్‌లో కదలిక వచ్చింది. నుపుర్ శర్మ, జిందాల్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. వారి విద్వేషపూరిత వ్యాఖ్యలకు పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కానీ అప్పటికే భారతదేశ ప్రతిష్ట, గౌరవానికి అంతర్జాతీయంగా భంగం వాటిల్లింది. గల్ఫ్ దేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న భయంతోనే కేంద్రం వ్యవహరించిందన్నది అందరికీ అర్థమైంది. గల్ఫ్ దేశాల్లో దాదాపు 89లక్షల మంది భారతీయులు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం భారత్‌కు చేరుతోంది.
ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని..
ఉదాహరణకు యూఏఈలో 33శాతం జనాభా భారతీయులే ఉన్నారు. భారత ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన 15 గల్ఫ్ దేశాల్లో ఖతార్ ఒకటి. ఈదేశ జనాభాలో 26శాతం, కువైట్ జనాభాలో 24శాతం, బహ్రె యిన్ జనాభాలో 19శాతం భారతీయులున్నా రు. వీరంతా ప్రతిఏటా భారత్‌కు సుమారు గా రూ.6.2లక్షల కోట్ల రూపాయలు (80 బిలియన్ డాలర్లు) పంపుతున్నారు. ప్రపంచం లోనే ఏ దేశానికీ తమ పౌరుల ద్వారా ఈస్థాయి లో విదేశీ మారకం లభించటం లేదు. ఈ మొత్తంలో సగభాగం గల్ఫ్‌లోని యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమన్ దేశాల నుంచి లభిస్తోంది. భారత్‌తో వాణిజ్య సంబం ధాల్లో యుఏఈ మూడో అతిపెద్ద భాగస్వామి. మన విదేశీ ఎగుమతుల్లో రెండో అతిపెద్ద దేశం యుఏఈ.
2021-22లో యుఏఈ-భారత్ ద్వై పాక్షిక వాణిజ్యం సుమారుగా రూ.5.6లక్షల కోట్లు(73 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఇందులో ఆ దేశానికి భారత్ ఎగుమతుల విలు వ సుమారుగా రూ.2.2 లక్షల కోట్లు (28.4 బిలియన్ డాలర్లు). భారత్ తన చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై పెద్దఎత్తున ఆధారపడింది. 60శాతం చమురు దిగుమతు లు గల్ఫ్ దేశాల నుంచి జరుగుతోంది. 2019లో భారత్ చమురు దిగుమతుల్లో ఇరాక్ నుంచి 22శాతం, సౌదీ నుంచి 19శాతం, యుఏఈ నుంచి 9శాతం చోటుచేసుకున్నాయి.
అన్ని మతాల్నీ గౌరవించాలి..
సమాజాన్ని ఆ వైపు ప్రోత్సహించాలి : ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్
న్యూయార్క్: బీజేపీ నాయకుల వివాదా స్పద వ్యాఖ్యలు ఐక్యరాజ్యసమితిని తాకాయి. గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరి ణామాల్ని దృష్టిలో పెట్టుకొని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ''అన్ని మతాలవారినీ మనం గౌరవిం చాలి. సమాజాన్ని ఆ వైపుగా నడిపించాలి. మత సహనాన్ని, పరస్పర గౌరవాన్ని సమా జంలోకి బలంగా తీసుకెళ్లాలి. బీజేపీ నాయకుల వ్యాఖ్యల తర్వాత మీడియాలో వస్తున్న వార్తా కథనాల్ని పరిశీలించా''మని గుటెర్రస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.
నుపుర్ శర్మకు సమన్లు
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మకు ముంబయిలోని థానే పోలీసులు సమన్లు జారీచేశారు. జూన్ 22నాటికల్లా తమ ముందు హాజరుకావాలని సమన్లలో పోలీసులు పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలపై ఆమె తన వివరణను పోలీసులకు అందజేయాల్సి వుంటుంది. ఈ ఉదంతానికి సంబంధించి థానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై (మే 27న) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే ఢిల్లీ బీజేపీ శాఖ మీడియా హెడ్‌గా ఉన్న నవీన్‌కుమార్ జిందాల్ ట్విట్టర్లో (జూన్ 1న) ఇస్లాంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విద్వేష వ్యాఖ్యలు యూపీలోని కాన్పూర్‌లో మత అల్లర్లకు దారితీసింది. రెండు వర్గాల ప్రజలు పరస్పరం రాళ్లదాడికి దిగటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు ఆరుగుర్ని అరెస్టు చేయగా, ఎఫ్ఐఆర్లో 1500మంది పేర్లను పేర్కొన్నారు. ఇదంతా కూడా ఇటు దేశంలో, అటు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వీరిద్దర్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని బీజేపీ ప్రక టించింది. వీరు చేసిన వ్యాఖ్యలు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్నే చిక్కుల్లో పడేసింది. భారత్‌తో సన్నిహిత వ్యాపార, వాణిజ్య సంబంధాలున్న అరబ్ దేశాలు వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.