Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ సామూహిక లైంగికదాడి కేసు విచారణ
- తెలంగాణ డీజీపీకి ఎన్సీడబ్ల్యూ నోటీస్
న్యూఢిల్లీ : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జరిగిన సామూహిక లైంగికదాడి కేసును జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) విచారణ చేపట్టనున్నది. గ్యాంగ్ రేప్ కేసు ఎన్సీడబ్ల్యూ దృష్టికి వచ్చిందని, మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మ అన్నారు. హైదరాబాద్లో జరిగిన ఇద్దరు మైనర్లపై జరిగిన అఘాయిత్యపు కేసుల గురించి రేఖాశర్మ మాట్లాడుతూ ''మైనర్పై రాజకీయ నాయకుల పిల్లలు కారులో సామూహిక లైంగికదాడి చేసిన మొదటి కేసును మేం గుర్తించాం. మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్నందున విషయం తీవ్రమైనది. ఈ రోజు నా దృష్టికి రెండో కేసు వచ్చింది. ఎన్సీడబ్ల్యూ దానిని పరిగణనలోకి తీసుకుంటుంది'' అని ఆమె తెలిపారు. తెలంగాణ డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ ) నోటీస్ ఇచ్చింది. బాలికలు, మహిళల భద్రత, రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై (ఇటీవలి జరిగిన అఘాయిత్యపు కేసులు) నేరుగా జోక్యం చేసుకుని ఏడు రోజుల్లో వివరణాత్మక నివేదికను పంపా లని తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో బాలికలు, మహిళలపై పెరుగు తున్న క్రూరమైన నేరాల పట్ల ఎన్సీడబ్ల్యూ ఆందోళన వ్యక్తం చేసింది.