Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మద్దతు ఉందని స్పష్టంగా వెల్లడయింది. మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వాఖ్యలు చేసిన నూపుర్ శర్మ, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించడం సంచలనంగా మారింది. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ ఇస్లామిక్ దేశాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. భారత రాయబారులకు సమన్లు జారీ చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో భారత వస్తువులను నిషేధిస్తున్నాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని.. చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వస్తున్నాయని నూపుర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు నూపుర్, ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడం విశేషంగా మారింది. 10 రోజుల క్రితం ఒక టీవీ చర్చా కార్యక్రమంలో నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఢిల్లీ మీడియా విభాగ బాధ్యుడు నవీన్ జిందాల్ అభ్యంతరకరమైన రీతిలో ట్విటర్లో స్పందించడం ఇటీవల తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో బిజెపి నూపుర్‌ను ఆరు ఏళ్లపాటు సస్పెండ్ చేయడంతో పాటు జిందాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. అయినా ఆమెకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించడంపై అనేక విమర్శలు వెలుళ్లువెత్తుత్తున్నాయి. సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ కూడా నూపుర్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఢిల్లీ సీపీ రాకేశ్ అస్థానాకు లేఖ రాసింది.