Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశానికి తలవొంపులు తెచ్చారు..
- మోడీ సర్కార్ మద్దతు వల్లే ఇదంతా : ఆంగ్ల పత్రికల ఎడిటోరియల్స్
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ నుంచి వచ్చే మద్దతు, అండదండలతోనే దేశంలో విద్వేష భావజాలం విజృంభిస్తోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో 'ఎడిటోరియల్స్' విమర్శించాయి. బీజేపీ నాయకుల విద్వేష వ్యాఖ్యలు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ఆంగ్ల దిన పత్రికలు ద హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ద ట్రిబ్యూన్, ద టెలిగ్రాఫ్.. మొదలైనవి మంగళ వారం ఎడిటోరియల్స్ వెలువరించాయి. వి ద్వేష వ్యాఖ్యలపై మోడీ సర్కార్ వెంటనే చర్య లు తీసుకోలేదని, చాలా ఆలస్యం చేసింద ని 'ద హిందూ' వివరించింది. దేశ ప్రయోజ నాల్ని దెబ్బతీసిందని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' విమర్శిం చింది. 'దేశానికి సిగ్గుచేటు' అంటూ ద ట్రిబ్యూ న్ ఎడిటోరియల్ రాసింది. గల్ఫ్ దేశాలతో భారత్‌కు సన్నిహిత సంబంధాలు దెబ్బ తిన్నా యని..'ద టెలిగ్రాఫ్' పేర్కొన్నది.
చాలా ఆలస్యమైంది : ద హిందూ
బీజేపీ నాయకుల విద్వేష వ్యాఖ్యలపై మోడీ సర్కార్ చాలా ఆలస్యంగా స్పందించింది. కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం వెనుకా డింది. దోహా, కువైట్లలో భారత రాయబార కార్యాలయాలు విడుదల చేసిన ప్రకటనలు పరి స్థితిని మరింత దిగజార్చాయి. న్యూస్ ఛానల్స్ రాత్రిపూట నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమా లు...విద్వేష వ్యాఖ్యలకు వేదికగా మారుతున్నా యని ఎడిటోరియల్ అభిప్రాయ పడింది. టీ ఆర్పీ రేటింగ్స్ కోసం అలాంటి చర్చలను పదే పదే జరుపుతున్నాయని పేర్కొన్నది. కేంద్రం సరైన సమయంలో స్పందించలేదని తెలిపింది.
దేశ ప్రయోజనాల్ని దెబ్బతీశాయి : ఇండియన్ ఎక్స్‌ప్రెస్
''పార్లమెంట్లో బలముందన్న ఉద్దేశంతో పాలకులు హద్దుమీరుతున్నారు. మెజార్టీ ఉందని ఏమైనా చేస్తామంటే నడవదు. ప్రతిదాన్నీ ఓటు బ్యాంక్‌తో కొట్టిపారేయలేరు'' అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటోరియల్ విమర్శించింది. ప్రార్థనా స్థలాలపై, మైనార్టీల పై దాడులు పెరిగాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ వ్యాఖ్యలు చేయగా, వాటిని 'ఓటు బ్యాంక్ రాజకీయాలుగా' మోడీ సర్కార్ కొట్టిపారేసింది. ఇప్పుడు అదేవిధంగా విద్వేష వ్యాఖ్యలపైనా స్పందించటం కుదరదని చురకలు అంటించింది.