Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ వార్తా ఛానల్లో
డిబెట్ పెడతారా ?
- పాత్రికేయ విలువలు దెబ్బతిన్నాయి :
'ఎడిటర్స్ గిల్డ్' ఆగ్రహం
న్యూఢిల్లీ : నుపుర్ శర్మ విద్వేష వ్యాఖ్యల్ని ప్రసారం చేయటం ద్వారా టీవీ ఛానల్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, దేశానికి తల వంపులు తీసుకొచ్చిందని 'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' పేర్కొన్నది. దేశంలో తీవ్ర దుమారం రేపిన బీజేపీ నాయకుల మత విద్వేష వ్యాఖ్యలపై 'ఎడిటర్స్ గిల్డ్' బుధవారం స్పందించింది. కొన్ని వార్తా ఛానల్స్ వ్యవహ రించే తీరును తప్పుబట్టింది. టైమ్స్ నౌ వార్తా ఛానల్లో మే 26న ప్రసా రమైన ఒక చర్చా కార్యక్రమంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదుపై మాట్లాడుతూ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ అత్యంత వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. ఇది దేశీయంగా, అటు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. భారత రాయబారుల్ని పిలిపించి గల్ఫ్ దేశాలు సమన్లు జారీ చేసేంత వరకు విషయం వెళ్లింది. గల్ఫ్ దేశాల్లో సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారతీయ ఉత్పత్తులను బారు కాట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమైంది. నుపుర్ శర్మ వ్యాఖ్యల కారణంగా జూన్ 3న కాన్పూర్‌లో రెండు వర్గాలకు చెందిన వారి మధ్య జరిగిన రాళ్లదాడిలో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
''దేశంలో ఒక అనవసరమైన రాద్ధాంతానికి కారణం ఒక టీవీలో జరి గిన చర్చా కార్యక్రమం. నుపుర్ శర్మ వ్యాఖ్యలు, వాటిని ప్రసారం చేయ టం..ఇదంతా దేశానికే తలవంపులు తీసుకొచ్చింది. లౌకికత్వం, భారత రాజ్యాంగంపై కనీస అవగాహన ఉన్నట్టయితే ఆ టీవీ ఛానల్ ఇలాంటి డిబేట్‌ను ప్రసారం చేసి ఉండేది కాదు. పాత్రికేయ విలువలు కూడా దెబ్బతిన్నాయి. మత విశ్వాసాలు, ఒక వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకోవటం వార్తా ఛానల్ బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది. ఇదంతా కూడా ద ఎడిటర్స్ గిల్డ్‌ను ఎంతగానో ఆందోళనకు గురిచేసింది'' అని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. తీవ్రమైన విద్వేషపూరిత మాటల్ని ప్రసారం చేసే ముందు ఆ టీవీ ఛానల్స్ పునరాలోచించుకోవాలని కోరింది.