Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పిల్లలు సరిగ్గా చదవకపో యినా.. హోం వర్క్ చేయకపోయినా.. తల్లిదండ్రులు మందలిస్తారు.. ఒకవేళ కోపంతో చిన్నదెబ్బ వేసినా వెంటనే సముదాయిస్తారు.. కానీ హోంవర్క్ చేయలేదన్న కోపంతో చిన్నారి (5) కాళ్లు చేతులు కట్టేసి మండుటెండలో మిట్టమధ్యాహ్నం మిద్దెపై పడేసింది ఓ తల్లి..! దేశ రాజధాని న్యూఢిల్లీలో ఖజూరీ ఖాస్ ప్రాంతంలో జూన్ 2న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. పోలీసుల కథనం మేరకు ... అయిదేండ్ల చిన్నారి హోం వర్క్ చేయలేదన్న కోపంతో ఆమె తల్లి చిన్నారిని కఠినంగా శిక్షించింది. మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో మిద్దెపై చిన్నారి కాళ్లు, చేతులను కట్టిపడేసింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక ఆ చిన్నారి పెడుతున్న కేకలు స్థానికులను కదిలించాయి. ఈ ఘటనను పొరుగింటి మహిళ 25 సెకన్ల వీడియో తీసి.. తీవ్రమైన ఎండలో, మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో ఈ ఉదంతం చోటుచేసుకొన్నది.