Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఖరీఫ్ పంటలకు ఇటీవల పెంచిన కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ)లో మోడీ ప్రభుత్వం రైతులను మరోసారి మోసం చేసిందని ఏఐకేఎస్ విమర్శించింది. 2022-23 ఖరీఫ్‌కు ప్రకటించిన ఎంఎస్‌పిలో వరి, మొక్కజొన్న, తురుము, వేరుశెనగకు ఎమ్ఎస్పీ కేవలం 7 శాతం, బాజ్రాకు కేవలం 8 శాతం పెంచిందని తెలిపింది. ఇంధనం, ఇతర ఇన్పుట్లు, ఎరువుల సరఫరాలో భారీ కొరత, ధరల పెరుగుదల కారణంగా రైతులకు ఉత్పత్తి వ్యయం తీవ్రంగా పెరిగిన సమయంలో ఈ ఎంఎస్పీని స్వల్పంగా ప్రభుత్వం పెంచిందని విమర్శించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని నివారించడానికి మన స్వంత రైతులకు లాభదాయకమైన ధరలను అందించానికి బదులు ప్రభుత్వం వారి పట్ల వివక్ష చూపుతోందని తెలిపింది. స్వామినాథన్ కమిషన్ ఫార్ములాను అమలు చేయాలని డిమాండ్ చేసింది. .
ఎంఎస్పీలో కేంద్ర మోసాన్ని నిరసిస్తూ, తమ పంటలకు ఎమ్ఎస్పీని చట్టబద్ధమైన హక్కుగా కల్పించాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఐక్యంగా ర్యాలీ చేయాలని దేశవ్యాప్తంగా రైతులకు ఏఐకేఎస్ పిలుపునిచ్చింది.
డబ్ల్యూటీఓ సదస్సులో రైతుల స్వరం వినిపించండి: ప్రధాని మోడీకి ఏఐకేఎస్ లేఖ
ఈ నెల 12 నుంచి 15 వరకూ జెనీవాలో జరిగే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) 12వ మంత్రుల సమావేశంలో భారత రైతుల స్వరం వినిపించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏఐకేఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం లేఖ రా సింది. కోవిడ్ సంక్షోభం కారణంగా వ్యవసా య రంగం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని, ఎరువుల, ఇంధనం, ఇతర ఇన్పుట్ల ఖర్చుల పెరగడంతో రైతులకు ఉత్పత్తి ఖర్చు గణ నీయంగా పెరుగుతోందని, మరోవైపు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించకపోవ డంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుని పోతున్నా రని ఏఐకేఎస్ తెలిపింది. వాణిజ్య సర ళీకరణ విధానాలు, వ్యవసాయ- ఆహార సబ్సిడీల తొలగింపు, దిగుమతి సుంకాల రద్దుతో రైతులు మరన్ని కష్టాలు ఎదుర్కొంటు న్నారని చెప్పారు. డబ్ల్యూటీఓ, అసమాన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల నుంచి వ్యవసా యాన్ని దూరంగా ఉంచాలనే వైఖరికి కట్టు బడి ఉన్నామని ఏఐకేఎస్ తెలిపింది.
సంస్థలో చట్టాలు కోట్లాది మంది భార తీయ రైతులకు హానికరమని, ఈ సదస్సులో భారతీయ రైతుల ప్రయోజనాలను రక్షించ డం అత్యవరసరమని తెలిపింది. ధనిక దేశా లు తమ రైతులకు భారీ స్థాయిలో సబ్సిడీలు ఇస్తాయని, అయితే భారత ప్రభుత్వమిచ్చే స్వల్ప రాయితీలను డబ్ల్యూటీఓ సదస్సులో సవాలు చేస్తాయని ఏఐకేఎస్ తెలి పింది. ధనిక దేశాలు తమ మార్కెట్‌ను పెంచుకోవ డానికి కుట్ర పన్నుతూ ఉంటాయని, అభివృ ద్ధి చెందుతున్న దేశాలను సమీకరించ డానికి భారత్ రెట్టింపు శక్తితో కృషి చేయాలని తెలి పింది.ఈ సమావేశంలో రైతల సమస్యల పై శాశ్వత పరిష్కారం కోసం తీవ్రంగా డిమాండ్ చేయాలని, సంపన్న దేశాలు ఇచ్చే అన్యాయ మైన సబ్సిడీలను సవాలు చేయా లని భారత ప్రభు త్వానికి ఏఐకేఎస్ విజ్ఞప్తి చేసింది.