Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూపుర్ శర్మ, నవీన్ కుమార్‌పై కేసు
- ఒవైసీ, యతి నర్సింగ్ నంద్ తదితరులపైనా..
- రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రెండు వారాల తరువాత తీరిగ్గా బీజేపీ నాయ కులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జి ందాల్పై ఢిల్లీ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. వీరిద్దరితో స హా ఎఐఎంఐఎం అధ్యక్షులు, ఎంపీ అ సదుద్దీన్ ఒవైసీ, వివాదస్పద మత ప్ర చారకుడు యతి నర్సింగనంద్, జర్నలి స్టు సభా నఖ్వీ, కొంత మంది సోషల్ మీడియా యూజర్లు, మత సంస్థలకు చెందిన సభ్యుల పేర్లతో ఢిల్లీ పోలీసు లు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చే శారు.విద్వేష ప్రసంగాలు,మత ఘర్ష ణలు ప్రేరేపించడం, సమాజంలో శాంతి-సామరస్యానికి భంగం కలిగిం చే పరిస్థితులు సృష్టించడం వంటి ఆరోపణలతో ఎఫ్ఐఆర్లు నమోద య్యాయి. 'సమాజ శాంతికి విఘాతం గా సందేశాలను పోస్ట్ చేయడం, షేర్ చేయడం, వివిధ మార్గాల ద్వారా ప్రజ లను రెచ్చగొట్టిన వారిపై కేసులు నమోదు చేశాం' అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మత ఘర్షణలు రెచ్చగొట్ట డం, మత చిహ్నాలను అవమానిం చడం, బహిరంగ దుష్పప్రవర్తనకు చెందిన సెక్షన్లు 153, 295, 505 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు చెప్పారు.
ఢిల్లీ పోలీసులు ఇంత ఆలస్యంగా చర్య తీసుకోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకు లు వ్యాఖ్యలపై 16 దేశాలు తీవ్ర అభ్య ంతరం వ్యక్తం చేసిన తరువాత ఢిల్లీ నెమ్మదిగా స్పందించారని విమర్శలు వస్తున్నాయి. అయితే కేసు నమోదు చేసినా దీనిపై ఢిల్లీ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారా లేదా సుమోటా గా కేసు నమోదు చేశారనే విషయంపై స్పష్టత లేదు. సోషల్ మీడియా యూ జర్ల మరిన్ని వివరాలకు ఆయా సంస్థ లకు నోటీసులు పంపుతున్న చెప్పారు.
ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక విభాగం ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ (ఐఎఫ్‌ఎస్‌ఒ) విభాగం ఈ కేసు నమోదు చేసింది. నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందా ల్తో పాటు పీస పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి షాదాబ్ చౌహాన్, జర్నలిస్టు సబా నఖ్వీ, హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా షకున్ పాండే, రాజస్థాన్ కు చెందిన మౌలానా ముఫ్తీ నదీం, అబ్దుర్ రెహ్మాన్, అనిల్‌కుమార్ మీనా, గుల్జార్ అన్సారీల పేర్లు ఉన్నాయి.