Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూరత్ వజ్రాల పరిశ్రమపై దెబ్బ
- రష్యా నుంచి ముడి పదార్థాలు రాక ఇబ్బందులు
- 5లక్షల మంది కార్మికుల ఉపాధి గల్లంతు
న్యూఢిల్లీ:పాఠశాల చదువు మధ్య లో ఆపేసిన మితోష్ పటేల్ సూరత్ లోని వజ్రాల తయారీ పరిశ్రమలో ఒక కార్మికుడు. డైమండ్ కట్టింగ్, పాలిషిం గ్ పని అతడికి ఉపాధి చూపింది. చేతి నిండా పని ఉన్నరోజు..నెలకు అతడికి రూ.18వేల ఆదాయాన్ని తెచ్చిపెట్టేది. అయితే ఉక్రెయిన్ సంక్షోభం కారణం గా పరిస్థితులు ఒక్కసారిగా మారిపో యాయి. రష్యా నుంచి ముడిసరుకుల రాక నిలిచిపోయింది. దాంతో సూరత్ లో వజ్రాల తయారీ మందగించింది. మితోష్ పటేల్‌కు గత 100 రోజులుగా పనిలేదు. సూరత్‌లో మితోష్ పటేల్ లాంటి కార్మికులు కొన్ని లక్షల మంది ఉన్నారు. భావ్‌నగర్, ఆమ్రేలీ, జునా ఘర్, రాజ్‌కోట్, సూరత్ జిల్లాల్లో కార్మి కుల ఉపాధి గల్లంతైంది. తమ సమస్య ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా..ఫలితం లేదని అక్కడి పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
''ఉక్రెయిన్ సంక్షోభం మొదల య్యాక..నా పని మొత్తం ఆగిపో యింది. ఒక్కటంటే ఒక్క ముడి వజ్రం పని నా వద్దకు రాలేదు. సూరత్‌లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ముడి వజ్రాల్ని దిగుమతి చేసుకుంటాయి. వాటి కట్టింగ్, పాలిషింగ్ పనులు ఇక్కడి కారికులకు అప్పజెబుతారు. ఈ పనిలో నైపుణ్యం ఉన్న కార్మికులకు మంచి డిమాండ్ ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభంతో వజ్రాల తయారీ ఆగిపో యింది. గత వంద రోజులుగా కార్మికు లకు పని దొరకటం లేదు'' అని పటేల్ ఆవేదన నిండిన గొంతుతో గోడు వెళ్లబోసుకున్నాడు.
సూరత్‌లో మితోష్ పటేల్ లాంటి కార్మికులు దాదాపు 5లక్షల మందికి పైగా ఉన్నారు. ఈ నగరంలోని వజ్రా ల తయారీ పరిశ్రమే వారికి జీవనో పాధి. రెండు తరాలుగా డైమండ్ కట్టింగ్, పాలిషింగ్ పనిలో నిమిగ మైన కార్మికుల కుటుంబాలున్నాయి. సూరత్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతా ల్లోనూ వజ్రాల తయారీ సంబంధిత పనులు పెద్ద ఎత్తున సాగుతాయి. కొంతమంది ఉదయం వ్యవసాయ పనులు పూర్తిచేసుకొని..ఆ తర్వాత డైమండ్ కట్టింగ్, పాలిషింగ్ పనులకు వెళ్తారు. చిన్న చిన్న వ్యాపారులు ముడి వజ్రాల్ని ప్రత్యేకంగా కొంతమంది ఇం టికి తీసుకువచ్చి పనులు అప్పజెబు తారు. ముడి వజ్రం కట్టింగ్, పాలిషిం గ్ తర్వాత దానివిలువ ఎన్నోరెట్లు పెరుగుతుంది. వీటికి సంబంధించిన పనులు భావ్‌నగర్, ఆమ్రేలీ, జునా ఘర్, రాజ్‌కోట్, సూరత్ జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగుతాయి.
2008లో ఇలాగే..
ప్రపంచవ్యాప్తంగా 2008లో ఆర్థికమాంద్యం పరిస్థితులు తలెత్తిన ప్పుడు సూరత్ వజ్రాల తయారీ తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొం ది. పరిశ్రమ అంతా కూడా దాదాపు 35రోజులపాటు మూతపడింది. లక్షల మంది ఉపాధి కోల్పోయారు. మళ్లీ అలాంటి విపత్కర పరిస్థితులు నేడు నెలకొన్నాయి. వజ్రాల తయారీలో ముడి సరుకులు ప్రధానంగా రష్యా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి అవుతాయి. తయారైన వజ్రా భరణాల్ని ఎక్కువగా కొనుగోలు చేసేది అమెరికా. వజ్రాభరణ ఎగుమ తుల్లో అత్యధికం అమెరికా, యూరప్ దేశాలకు వెళ్తాయి. ఉక్రెయిన్ సంక్షోభం వల్ల రష్యా కంపెనీలపై అమెరికా ఆంక్ష లు విధించింది. ముడి సరుకులు దిగు మతి చేసుకోరాదని నిబంధనలు కఠిన తరం చేసింది. దాంతో ఇక్కడి తయారీ అంతా కూడా ప్రభావితమైంది.