Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలుగా మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా
విశాఖపట్నం : ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ సంయుక్తంగా విశాఖలోని బీచ్ రోడ్డులో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన జాతీయ గిరిజన నృత్సోత్యవాలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఆదివారం ముగిశాయి. చివరి రోజు కళాకారుల ప్రదర్శనలు అబ్బురపరిచాయి. జార్ఖండ్ నుంచి పైక, కర్నాటక నుంచి దమంల్, మహారాష్ట్ర నుంచి గోండిద్మేసే, ఆంధ్రప్రదేశ్ నుంచి సవర, మణిపూర్ నుంచి దాపచోన్, హోర్నబిల్ డ్యాన్స్‌లు, ఒడిశా నుంచి ఫగున్ ధందరి, మిజోరం నుంచి సోలాకీయా, గుజరాత్ నుంచి భిల్, తెలంగాణ నుంచి ఆదివాసీ గొంది థింసా నృత్యాలను ప్రదర్శించారు. ముగింపు వేడుకల్లో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్రావు, ఎపి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, విశాఖ కలెక్టర్ ఎ.మల్లికార్జున, పాడేరు, పాలకొండ ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, కళావతి, జిసిసి చైర్మన్ శోభ స్వాతిరాణి, విశాఖ నగర పోలీసు కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్, జివిఎంసి కమిషనర్ లక్ష్మీశ, జెడ్పి చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ నృత్య ప్రదర్శనల్లో మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల కళాకారులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వారికి అతిథులు బహుమతులు అందజేశారు.