Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫడ్నవిస్ కూడా శివసేనకే ఓటువేస్తాడు : ఎంపి సంజయ్‌రౌత్
ముంబయి : తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి విజయానికి కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యం, బిజెపి కుటిలరాజకీయాలే కారణమని శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆదివారం ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ని మాకు రెండు రోజులు అప్పగిస్తే, ఫడ్నవీస్, బిజెపి కూడా తమకే ఓటు వేస్తాయని సంజరు రౌత్ అన్నారు. బిజెపి తన విజయం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కేంద్ర హోం శాఖకు మహారాష్ట్ర బిజెపి నాయుకులు ఫోన్లు చేస్తున్నారని, కేంద్ర హోం శాఖ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫోన్లు వెళుతున్నాయని సంజరు రౌత్ చెప్పారు.